మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 14 నవంబరు 2017 (19:15 IST)

పని ఒత్తిడి అనిపించినప్పుడు ఇవి తింటే సరి...

ఎండు ద్రాక్ష రుచికి పుల్లగా, తియ్యగా ఉంటాయి. అందరూ ఇష్టపడే ఎండు ద్రాక్షలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు చాలానే ఉన్నాయి. మన శరీరానికి కొన్ని రోగాలు రాకుండా కాపాడడంలో ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్ష రక్తపోటును అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధ

ఎండు ద్రాక్ష రుచికి పుల్లగా, తియ్యగా ఉంటాయి. అందరూ ఇష్టపడే ఎండు ద్రాక్షలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు చాలానే ఉన్నాయి. మన శరీరానికి కొన్ని రోగాలు రాకుండా కాపాడడంలో ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్ష రక్తపోటును అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధిని దరిచేరనివ్వదు. ఎండు ద్రాక్షలో కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఎముకలకు బలాన్ని ఇస్తుంది. 
 
ఎండు ద్రాక్షను తరచూ తింటే సీజనల్‌గా వచ్చే వైరల్ ఫీవర్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మన దరిచేరకుండా ఉంటాయి. అంతేకాదు రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. పనిలో ఒత్తిడిగా అనిపించినప్పుడు ఎండు ద్రాక్షను తింటే వెంటనే తక్షణ శక్తి వస్తుంది. అంతే కాదు రక్తంలో కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా ఎండు ద్రాక్షను తినాలి. ఆఫీస్‌కు వెళ్ళేటప్పుడు నాలుగైదు ఎండు ద్రాక్షలను తినివెళితే పని ఒత్తిడి అనిపించదు.
 
ఎండు ద్రాక్షను తరచూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కంటి సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. చర్మాన్ని కూడా ఇది కాపాడుతుంది. చర్మ కణాలు నాశనం కాకుండా, కాంతివంతమయ్యేలా చేస్తుంది. అంగస్తంభంన దూరమై లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.