శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (10:03 IST)

ఆపిల్‌‌తో మేలెంతో తెలుసుకోండి..

ఆపిల్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిండి పదార్థాలతో పాటు విటమిన్-ఎ, విటమిన్-బి1, బీ2, బీ3, బీ6, బీ9, విటమిన్-సి వంటి విటమిన్లు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ఖనిజ లవణాలుంటాయి. ఆ

ఆపిల్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిండి పదార్థాలతో పాటు విటమిన్-ఎ, విటమిన్-బి1, బీ2, బీ3, బీ6, బీ9, విటమిన్-సి వంటి విటమిన్లు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ఖనిజ లవణాలుంటాయి. ఆపిల్‌ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఓ మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్, రక్తహీనత, క్యాన్సర్ వంటి ఎన్నో సమస్యలకు నివారిణిగా ఆపిల్‌ అద్భుతంగా పనిచేస్తుంది. గుండె జబ్బులు, పొడిదగ్గు, రక్తపోటు తదితర ఆరోగ్య సమస్యలకు కూడా ఆపిల్‌ దూరం చేస్తుంది.
 
ఆపిల్ పండ్లు, ఆపిల్ రసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ ఆపిల్ జ్యూస్ తాగడం వలన మతిమరుపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. రోజులో రెండు గ్లాసుల ఆపిల్‌ జ్యూస్‌ తాగితే శరీరంలో బీటా- అమైలిడ్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఆపిల్‌ జ్యూస్‌ తాగటం వల్ల బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. ఇది శరీరంలో కొవ్వు పదార్థాలను నియంత్రిస్తుంది. 
 
వయసు మీరిన వాళ్ళల్లో వచ్చే డిమెంటియాని రోజూ ఆపిల్‌ జ్యూస్‌ తాగటం వల్ల తగ్గించుకోవచ్చు. ఇది వ్యాధిని తగ్గించటమే కాకుండా, మెదడును చురుగ్గా ఉంచేలా చేస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్లు, ఫోలేట్‌ వంటి శక్తిని విడుదల చేసే కారకాలను ఆపిల్‌ జ్యూస్‌ పుష్కలంగా కలిగి ఉంటుంది.
 
గ్లాస్‌ ఆపిల్‌ జ్యూస్‌, మూత్రపిండాలు, కాలేయానికి హాని కల్గించే విష పదార్థాలను తొలగించి, శుభ్రపరుస్తుంది. ఆపిల్‌ జ్యూస్‌ విటమిన్‌-ఏ ని కలిగి ఉండటం వలన కంటికి వచ్చే వ్యాధులను దూరంగా ఉంచి కంటిచూపును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.