శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (11:50 IST)

గుండెకు బలాన్నిచ్చే డార్క్ చాక్లెట్.. రోజూ తింటే ఒత్తిడి మటాష్

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం.. శారీరక శ్రమ లేని పనులు చేస్తుండటంతో అనారోగ్య సమస్యలు తప్పట్లేదు. తద్వారా ఒబిసిటీ, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలు వేధిస్తున్నాయి. హృద్రోగ సంబంధిత రోగాల నుంచి తప్

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం.. శారీరక శ్రమ లేని పనులు చేస్తుండటంతో అనారోగ్య సమస్యలు తప్పట్లేదు. తద్వారా ఒబిసిటీ, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలు వేధిస్తున్నాయి. హృద్రోగ సంబంధిత రోగాల నుంచి తప్పించుకోవాలంటే.. డార్క్ చాక్లెట్ తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి డార్క్ చాక్లెట్స్ మేలు చేస్తాయ‌ని వారు సూచిస్తున్నారు. 
 
డార్క్ చాక్లెట్‌లో ఫైబ‌ర్‌, ఖ‌నిజాలు పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఒలిక్‌, స్టియ‌రిక్‌, పాల్మిటిక్ యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగు పరుస్తాయి. డార్క్ చాక్లెట్‌లో వుండే ఫ్లావనోల్స్ వల్ల గుండెకు, మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. క్యాన్స‌ర్ ముప్పును కూడా డార్క్ చాక్లెట్ త‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుంది. అలాగే పని ఒత్తిడిలో ఉన్నవారు టీ కాఫీలు తాగేస్తుంటారు. 
 
ప్రతిరోజూ ఒక చాక్లెట్ తింటే లో-బీపీతో పాటు పని ఒత్తిడిని నియంత్రించవచ్చు. అధిక శాతం కోకా కలిగి ఉన్న డార్క్ చాక్లెట్, ఒత్తిడిని తగ్గించే 'ఎండార్ఫిన్' ఉత్పత్తి చేస్తాయి. హాట్ కోకా తాగటం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గటమే కాకుండా, మెదడుకు విశ్రాంతి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.