శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (10:47 IST)

ఆస్తమాకు, ఒబిసిటీకి దివ్యౌషధం బెండకాయ

ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో, చలికాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు నానా తంటాలు పడుతుంటారు. అలాంటివారు డైట్‌‌లో బెండకాయను చేర్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. భోజనంలో ఏదో ఒక రూపంలో ర

ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో, చలికాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు నానా తంటాలు పడుతుంటారు. అలాంటివారు డైట్‌‌లో బెండకాయను చేర్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
 
వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. ఆధునిక జీవనశైలి తెస్తున్న ముప్పులో మొదటిది అధిక బరువు సమస్య. కూర్చుని చేసే ఉద్యోగాలకుతోడు, మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుండే వాళ్లను ఒబిసిటీ వేధిస్తుంది. దీనికి బెండకాయ దివ్యౌషధం. బెండకాయ అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది.
 
వాటన్నిటికీ తోడు చర్మ సౌందర్యంలోను దీని ప్రాముఖ్యం అధికం. ఇందులోని విటమిన్‌ సి చర్మాన్ని యుక్తవయసులో ఉన్నట్లు చేస్తుంది. జబ్బులు దరి చేరనీయదు. జుట్టు రాలడాన్ని అరికట్టి, రోగనిరోధకశక్తిని పెంచి, కంటిచూపును మెరుగుపరిచి, ఎనీమియా, డయాబెటిస్‌ను రాకుండా చూస్తుంది. బెండకాయలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది.