శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (11:16 IST)

టమోటాలతో చర్మ సౌందర్యం.. బ్యాడ్ కొలెస్ట్రాల్‌కూ చెక్..

టమోటాలతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. టమోటాలు ముఖం మీద ఉన్న బ్లాక్‌ హెడ్స్‌ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. టమోటా గుజ్జును ముఖంపై అప్లై చేసి, అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చర్మం నిగారి

టమోటాలతో చర్మ సౌందర్యం  మెరుగుపడుతుంది. టమోటాలు ముఖం మీద ఉన్న బ్లాక్‌ హెడ్స్‌ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. టమోటా గుజ్జును ముఖంపై అప్లై చేసి, అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చర్మం నిగారింపును సొంతం చేసుకుంది. మొటిమలను తొలగించడంలో టమోటాలు మెరుగ్గా పనిచేస్తాయి. విటమిన్‌ ఏ, సి, కె మొటిమలను తొలగించడంలో సహాయపడుతాయి.
 
రోజువారీ ఆహారంలో టమోటాలను చేర్చడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. టమోటాల్లో కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా ఫైబర్‌ ఉన్నందున బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌‌ దూరమవుతుంది. ఎండలో తిరగడం వల్ల ముఖానికి మురికి పట్టడం సహజం. దీంతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యకు టమోటాతో చెక్ పెట్టొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.