1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. Health Issues with Fried Chicken and Fish

మహిళలకు ఫ్రైడ్ చికెన్, చేపలను అస్సలు ఇవ్వొద్దు.. ఎందుకు?

Health Issues
ఫ్రై చేసిన చికెన్, చేపలంటే చాలామందికి ఇష్టం. కొంతమంది లొట్టలేసుకుని తింటారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటిల్లిపాది చికెన్ లేకుంటే చాపలు, లేకుంటే ఇతరత్రా మాంసాలను తెచ్చుకుని తింటుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో ఫ్రై చేసిన చికెన్, చేపలు తింటే వచ్చే అనర్థాలు వివరించడం అందరిలోను ఆందోళనను రేకెత్తిస్తోంది.
 
ఫ్రైడ్ చికెన్, చేప తినే మహిళలకు గుండెజబ్బు, క్యాన్సర్లు త్వరగా రావడం ఖాయమంటున్నారు వాషింగ్టన్‌కు చెందిన ఉమెన్స్ హెల్త్ ఇన్వెస్టిగేషన్‌కు చెందిన వైద్యులు. లక్షా 10వేలమంది మహిళలను పరీక్షిస్తే ఫ్రై చేసుకుని చికెన్, చేపలు తిన్న వారిలో గుండె జబ్బు, క్యాన్సర్ లాంటి లక్షణాలు వచ్చాయని కనిపెట్టారట. 
 
అయితే ఎందుకు వారిలో ఈ జబ్బులు వస్తాయన్న విషయాన్ని మాత్రం వారు చెప్పలేదు. ప్రస్తుతం ఈ పరిశోధనలో వెల్లడైన విషయాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
About Writer
జె
తర్వాతి కథనం
పచ్చి పసుపులో ఆవు పెరుగు కలిపి తీసుకుంటే?