రన్ మిషీన్ రికార్డును బద్ధలు కొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్
ఆధునిక క్రికెట్‌లో పరుగుల యంత్రంగా గుర్తింపు పొందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ మధ్య కాలంలో క్రికెట్‌లో ఏ రికార్డు బద్దలుకొట్టాలన్నా అది కోహ్లీకే సాధ్యంగా మారింది. ఈ రన్‌మెషీన్ అంతటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
అలాంటి కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టారు. ఆ క్రికెటర్ పేరు హషీమ్ ఆమ్లా. సౌతాఫ్రికా ఓపెనర్. పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆమ్లా.. విరాట్‌ను వెనక్కి నెట్టాడు. వన్డేల్లో వేగంగా 27 సెంచరీల మార్క్ అందుకున్న ప్లేయర్‌గా అతడు నిలిచాడు.
కోహ్లి 169 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్ అందుకోగా.. ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లోనే 27 సెంచరీలు చేయడం విశేషం. కోహ్లి కంటే ముందు సచిన్ (254 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. 2017, జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. రెండేళ్ల కిందటి కోహ్లి రికార్డును ఇప్పుడు ఆమ్లా తిరగరాశాడు. అయితే ఈ రికార్డు సెంచరీ కూడా సౌతాఫ్రికాను గెలిపించలేకపోయింది.