శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (13:02 IST)

నీళ్లను గటగటా తాగేస్తున్నారా?

సాధారణంగా చాలా మంది నీళ్లను గటగటా తాగేస్తుంటారు. మరికొంతమంది కొద్దికొద్దిగా తాగుతూనే ఉంటారు. అయితే, నీరు తాగేటపుడు గటగటా తాగకూడదని, నెమ్మదిగా తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలా తాగడం వల్ల కలిగే లా

సాధారణంగా చాలా మంది నీళ్లను గటగటా తాగేస్తుంటారు. మరికొంతమంది కొద్దికొద్దిగా తాగుతూనే ఉంటారు. అయితే, నీరు తాగేటపుడు గటగటా తాగకూడదని, నెమ్మదిగా తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలా తాగడం వల్ల కలిగే లాభనష్టాలను కూడా వారు వివరిస్తున్నారు. 
 
నీటిని కూడా మనం టీ, కాఫీ ఏవిధంగా తాగుతామో అలాగే తాగాలి. ఎందుకంటే నీళ్లను గటగటా తాగడం వలన శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి ఉంటుంది. ఈ కారణంగా అధిక ఎసిడిటి ఏర్పడుతుంది. 
 
ఈ ఎసిడిటి శరీరంలోని రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దానితో అనేక రకాలైన రోగాలు వస్తాయి. నీళ్లను సిప్ చేస్తూ తాగడం వలన ప్రతి గుటక నీటితో, నోటిలో ఉండే లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోకి పోతుంది. లాలాజలం కలిసిన నీరు కడుపులోకి వెళ్లినట్టయితే, ఎలాంటి హాని జరగదని వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం, మన శరీరానికి కావాల్సిన నీటిని ప్రతిరోజూ తాగితే అనేక రోగాలని మనకి రాకుండా రక్షించుకోవచ్చు.