శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 6 జూన్ 2017 (17:01 IST)

బట్టతలకు గోంగూరకు లింకేంటి..?!!

గోంగూరను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. గోంగూరలో విటమిన్ - ఎ, బి1, బి9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, పాస్పరస్, సోడియం, ఐరస్ సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉం

గోంగూరను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. గోంగూరలో విటమిన్ - ఎ, బి1, బి9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, పాస్పరస్, సోడియం, ఐరస్ సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. గోంగూరలోని విటమిన్ - ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది. గోంగూరలోని కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ శరీర బరువును తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు సమపాళ్ళలో ఉన్నందున చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. త్వదారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
ఒక కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒకరోజుకు కావాల్సిన విటమిన్లలో 53 శాతం లభిస్తాయట. అలాగే గోంగూర చర్మ సంబంధమైన సమస్యలను నివారిస్తుంది. దీన్ని క్రమంగా వాడితే నిద్రలేమి సమస్య, అధికరక్తపోటు తగ్గిపోతుంది. 
 
గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేస్తే వెంట్రుకలు ఊడటం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది. గోంగూరలోని కాల్షియం ఎముకలు గట్టిపడటంలో మంచి ఫలితాన్నిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.