1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of pumpkin seeds

ప్రతిరోజు గుమ్మడికాయ విత్తనాలు తీసుకుంటే?

గుమ్మడికాయ విత్తనాల్లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విత్తనాల్లో జింక్, మెగ్నిషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, క్యాల్షియం, పాస్పరస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, బి వంటి ఖనిజాలు చా

pumpkin
గుమ్మడికాయ విత్తనాల్లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విత్తనాల్లో జింక్, మెగ్నిషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, క్యాల్షియం, పాస్పరస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, బి వంటి ఖనిజాలు చాలా ఉన్నాయి. గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
గుమ్మడికాయ విత్తనాలను పురుషులు తరచుగా తీసుకుంటే వారిలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. తద్వారా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కండరాలకు మరమ్మత్తులు చేయుటకు, కొత్త కణాలను నిర్మించుటకు గుమ్మడికాయ విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
గుమ్మడికాయ విత్తనాలను తరచుగా తీసుకోవడం వలన శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తిని పెంచుటకు గుమ్మడికాయ విత్తనాలు దివ్యౌషధంగా ఉపయోగపడుతాయి. నిత్యం వ్యాయామం చేసిన తరువాత గుమ్మడికాయ విత్తనాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని అధ్యయనంలో తెలియజేశారు. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
రోజుకి నాలుగు కరివేపాకులను నమిలి తింటే...?