బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (12:24 IST)

నెయ్యిని తరచుగా ఆహారంలో చేర్చుకుంటే?

పాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ పాలతోనే నెయ్యిని తయారుచేస్తారు. శరీరంలోని కొవ్వును కరిగించే విటమిన్స్ నెయ్యిలో అధికంగా ఉన్నాయి. వాటిల్లో విటమిన్ ఇ, ఎ కెలు కూడా ఉన్నాయి. ఈ విటమిన్స్ కంటి చూపును మెరు

పాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ పాలతోనే నెయ్యిని తయారుచేస్తారు. శరీరంలోని కొవ్వును కరిగించే విటమిన్స్ నెయ్యిలో అధికంగా ఉన్నాయి. వాటిల్లో విటమిన్ ఇ, ఎ కెలు కూడా ఉన్నాయి. ఈ విటమిన్స్ కంటి చూపును మెరుగుపరచుటకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. దాంతో చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
 
పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. శరీరంలోని ఇతర కొవ్వు, కలుషితపదార్థాలను సులువుగా బయటకు పోయేలా సహకరిస్తుంది. నెయ్యిలో విటమిన్ కె2 పుష్కలంగా ఉన్నాయి. ఎముకలకు కావలసిన క్యాల్షియంను అందజేస్తుంది. 
 
మెదడు చురుకుగా పనిచేయడానికి ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్‌ అవసరం. అటువంటి మంచి ఫ్యాట్స్ నెయ్యిలో చాలా ఉన్నాయి. నెయ్యిని తరచుగా తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆవునెయ్యి వాడకం ఆరోగ్యానికి చాలా మంచిది.