శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (17:36 IST)

స్మార్ట్‌ఫోన్స్ అధికంగా వాడితే... కళ్ళు పొడిబారిపోతాయట...

రోజు సుమారు 42 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్స్ మనం దేశంలో అమ్ముడుపోతున్నాయి. ఈ సంఖ్యను చూస్తుంటే మన దేశంలో మెుబైల్ ఫోన్స్ ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతుంది. అదే సమయంలో కంట్లో వేసుకునే చుక్కల మందులు కూడా భార

రోజు సుమారు 42 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్స్ మనం దేశంలో అమ్ముడుపోతున్నాయి. ఈ సంఖ్యను చూస్తుంటే మన దేశంలో మెుబైల్ ఫోన్స్ ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతుంది. అదే సమయంలో కంట్లో వేసుకునే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే 54 శాతం ఈ ముందులు అమ్మకాలు సంఖ్య పెరిగింది.
 
స్మార్ట్‌ఫోన్స్ మన కళ్లలో నీళ్లను ఆవిరి చేస్తుంటాయి. కనుక చాలామంది అధికంగా ఈ కంటి మందులను వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్స్ ప్రపంచంలో సమస్త సమాచారాలను మనకు అందిస్తుంది. అయితే మన అవసరాలు తీర్చడంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్, టాబ్స్ వాడడం వలన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతాయి. 
 
ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగనట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 70 శాతం మంది కళ్లు పొడిబారిన వారిలో సగం మంది 20 నుండి 30 మధ్య వయస్సు వారి ఉన్నారు. ఈ సమస్య కారణంగా కంటికి అవసరమైయ్యే నీరు ఉత్పత్తి కావడం లేదని ఎయిమ్స్ గతేడాది నిర్వహించిన సర్వేలో తెలియజేశారు. 
 
కంటి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతీ పదిమందిలో ఏడుగురు డిజిటల్‌ విజన్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నట్లుగా వైద్యునిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా గడిచిన నాలుగేళ్లలో 54 శాతం కంటి చుక్కల మందుల వ్యాపారం పెరిగింది.