సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By selvi
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (17:10 IST)

వినాయక చవితి రోజున ఎరుపు రంగు గణనాథుడిని పూజిస్తే?

గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున గణనాథుడిని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఉద్యోగంలో స్థిరపడకపోవడం, వివాహ అడ్డంకులు, ఉద్యోగం చేసే ప్రదేశంలో సహచరుల నుంచి ఇబ్బందు

గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున గణనాథుడిని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఉద్యోగంలో స్థిరపడకపోవడం, వివాహ అడ్డంకులు, ఉద్యోగం చేసే ప్రదేశంలో సహచరుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. వినాయక చవితి రోజున బ్రాహ్మీ ముహూర్తమున నిద్రలేవాలి.


శరీరానికి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని.. అరగంట తర్వాత స్నానం చేయాలి. ఆపై ఎరుపు రంగు వినాయకుడిని పూజించాలి. స్వామి వారికి ఎరుపు రంగు పూల మాలతో అలంకరించాలి. 
 
ఉలవ గుగ్గుల్లు, పాలతో తయారు చేసిన ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. దీపారాధనకు ముందుగా ''ఓం హరసూనవే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత నేతితో దీపారాధన చేసి.. పూజకు తర్వాత ప్రసాదాలను పేదలకు దానం చేయాలి.

కనీసం బాలుడికైనా వస్త్రదానం చేయాలి. ఇంకా వినాయక ఆలయంలో ఆ రోజు మీకు చేతనైన సేవ చేస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.