శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:57 IST)

మధుమేహం వున్నవారు పసుపు ''టీ'' తీసుకుంటే?

పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైయ్యే విటమిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ వంటి పోషకాలు పసుపు ద్వారా లభిస్తాయి. ఈ పసుపుతో టీ తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో

పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ వంటి పోషకాలు పసుపు ద్వారా లభిస్తాయి. ఈ పసుపుతో టీ తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. దానిని ముందుగా పసుపు టీ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
ఒక పాత్రలో కొద్దిగా నీళ్లను పోసుకుని అందులో చిటికెడు పసుపు వేసి ఆ నీటిని బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత పుదీనా ఆకులు, దాల్చిన చెక్క పొడి, తేనె, అల్లం రసం వీటిల్లో ఏదైనా ఒక పదార్థాన్ని ఆ నీటిలో వేసుకుని మరికాసేపు మరిగించుకోవాలి.  
 
పసుపు టీ తీసుకోవడం వలన పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. పసుపు టీ తాగడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం వ్యాధి గల వారు పసుపు టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.