ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 23 జూన్ 2016 (13:49 IST)

చెరుకు రసం... దీంట్లో సరకు చాలా ఉంటుంది... ఏంటంటే...?

ఏ రసమైనా ఇంట్లో తయరుచేసుకోగలం. ఒక్క చెరుకు రసం తప్ప. దీన్ని తాగాలంటే చెరకు బండి దగ్గరకు వెళ్లాల్సిందే. కానీ రోడ్డు మీద అమ్మే చెరుకు రసమా.. అని దీన్ని తేలికగా తీసిపారేయకండి. ఈ రసంలో సింపుల్ షుగర్స్ ఉండవు. కాబట్టి మధుమేహ రోగులతో సహా అందరూ నిక్షేపంగా దీ

ఏ రసమైనా ఇంట్లో తయరుచేసుకోగలం. ఒక్క చెరుకు రసం తప్ప. దీన్ని తాగాలంటే చెరకు బండి దగ్గరకు వెళ్లాల్సిందే. కానీ రోడ్డు మీద అమ్మే చెరుకు రసమా.. అని దీన్ని తేలికగా తీసిపారేయకండి. ఈ రసంలో సింపుల్ షుగర్స్ ఉండవు. కాబట్టి మధుమేహ రోగులతో సహా అందరూ నిక్షేపంగా దీన్ని తాగేయొచ్చు. దీనిలోని పొటాషియం, ప్రొటీన్, ఐరన్, కార్పొహైడ్రేడ్లు ఇతర పోషకాలు ఎండ తీవ్రత వల్ల కోల్పోయిన లవణాలను భర్తీ చేసి తక్షణ శక్తినిస్తాయి. చెరుకు రసంలో లాక్సేటివ్ గుణాలుంటాయి.ఇది మలబద్దకాన్ని పారద్రోలుతుంది. 
 
ఈ రసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి, దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. కామెర్ల వ్యాధిని తగ్గించడంలో చెరుకురసం మహత్తరంగా పనిచేస్తుంది. జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్లను చెరుకురసం భర్తీ చేయడానికి తోడ్పడుతుంది. మూత్ర సంబంధ సమస్యలను పరిష్కరిస్తుంది. విసర్జక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పి, ప్లూ, జలుబులను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంటతో కూడిన మూత్రనాళ సంబంధ ఇన్ఫెక్షన్లు, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యలను పరిష్కరించడంలో చెరుకు రసం ఎంతగానో దోహదపడుతుంది.