బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: శనివారం, 17 జూన్ 2017 (22:01 IST)

ఇలా చేస్తే శరీరంలో చెడు నీరు పోతుంది...

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పినప్పుడు మందులు వాడటం చేస్తుంటారు కొందరు. అయితే మందులు వాడాల్సిన పనిలేదు. మనం తీసుకునే ఆహారం ద్వారానే ఒంట్లోని నీటిని పంపేయవచ్చు. ఒంట్లో ఉప్పు శాతం ఎప్పుడూ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పులోని సోడియం శరీరంలో అధికం

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పినప్పుడు మందులు వాడటం చేస్తుంటారు కొందరు. అయితే మందులు వాడాల్సిన పనిలేదు. మనం తీసుకునే ఆహారం ద్వారానే ఒంట్లోని నీటిని పంపేయవచ్చు. ఒంట్లో ఉప్పు శాతం ఎప్పుడూ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పులోని సోడియం శరీరంలో అధికంగా నీరుండేలా చేస్తుంది. శరీరంలోని నీటిని బయటకు పంపాలంటే విటమిన్ బి6 తప్పకుండా కావాలి. ఈ విటమిన్ పప్పు, చేపలు, డ్రై ఫ్రూట్స్, పాలకూరల్లో పుష్కలంగా లభిస్తాయి.
 
వీటితో పాటు అరటిపండు, బీన్స్ వంటి వాటిని ఆహార పదార్థాలుగా తీసుకుంటే శరీరంలోని నీరు బయటకు పోతుంది. అలాగే ఆకుపచ్చని కూరగాయలు తీసుకుంటే చాలా మంచిది. నీటిని కూడా తగిన మోతాదుల్లో తాగాలి. పంచదార, పిండిపదార్థాలు, ఉప్పు తీసుకోకపోవడం చాలా మంచిదంటున్నారు వైద్యులు. 
 
వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరంలో నిల్వయ్యే అధిక నీటి సమస్య నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా జీలకర్రను నిత్యంను ఏదో ఒకరూపంలో ఆహారంగా తీసుకుంటే అధిక నీరు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. జీలకర్రను ప్రతిరోజు తాగే నీటిలో అరటీస్పూన్ లేదా ఒక స్పూన్ వేసి నానిన తరువాత ఆ నీటిని తాగితే ఒంట్లోని నీరు బయటకు వెళ్ళిపోతుంది. అంతే కాదు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.