శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (18:48 IST)

అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపి? (టిప్స్)

అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. కేలరీలు తక్కువగా ఉండి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. గుండెని భ‌ద్రంగా ఉంచుకుంటే మ‌న మెద‌డు కూడా ఆరోగ్

అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. కేలరీలు తక్కువగా ఉండి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. గుండెని భ‌ద్రంగా ఉంచుకుంటే మ‌న మెద‌డు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం కోసం ఖర్జూరం, దానిమ్మ ఫలాలు తీసుకోవటం చాలా మంచిది. దానిమ్మపండు, ఖర్జూరాలు హార్ట్‌అటాక్‌ను రాకుండా కాపాడతాయి. కేవలం నాలుగు ఔన్సుల దానిమ్మరసంకు తోడు మూడు లేదా నాలుగు ఖర్జూరాలని తీసుకోవాలి. 
 
గుండె పదిలంగా ఉండాలంటే.. బీ6, బీ12 వంటివి ఉండే ఆహారం తీుసకోవాలి. మోతాదుకు మించి మద్యం సేవించకూడదు. పొగ తాగడం మంచిది కాదు. బీపీ, షుగర్‌లను తగ్గించుకోవాలి. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.