శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:29 IST)

బియ్యం కడిగిన నీటితో ప్రయోజనాలు

బియ్యం కడిగిన నీరే కదా.. అని పారబోసేస్తున్నారా? కాస్త ఆగండి. బియ్యం కడిగిన నీటిని చర్మ, కేశ సంరక్షణకు ఉపయోగించుకోవచ్చుననే విషయం తెలుసుకోండి. ఎలాగంటే? బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టి ఆపై కడిగేయాలి. బియ

బియ్యం కడిగిన నీరే కదా.. అని పారబోసేస్తున్నారా? కాస్త ఆగండి. బియ్యం కడిగిన నీటిని చర్మ, కేశ సంరక్షణకు ఉపయోగించుకోవచ్చుననే విషయం తెలుసుకోండి. ఎలాగంటే? బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టి ఆపై కడిగేయాలి.
బియ్యం కడిగిన నీటిని వడగట్టి.. ముఖానికి రాసుకోవడం, జుట్టుకు రాసుకోవడం చేయాలి. పావు గంట తర్వాత స్నానం చేస్తే.. చర్మానికి మేలు చేకూరుతుంది. ఇంకా జుట్టు పెరుగుతుంది. 
 
బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని కడిగితే మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. చర్మం ప్రకాశవంతమవుతుంది. రోజుకోసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడిబారినట్లు కనిపిస్తే.. బియ్యం కడిగిన నీటిని మాడుకు జుట్టుకు పట్టించి 15 నిమిషాలకు తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.

జుట్టు రంగు మారదు. బియ్యం కడిగిన నీటిలో కార్బొహైడ్రేడ్లు, ధాతువులు పుష్కలంగా ఉండటంతో జుట్టుకు, చర్మానికి మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.