ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (11:15 IST)

ఈ 10 చిట్కాలు పాటిస్తే నోటి దుర్వాసన ఔట్

1. నోటి దుర్వాసనను పోగొట్టేందుకు వాసనతో కూడిన చూయింగ్‌‌, మౌత్ ఫ్రెష్‌నర్‌లను వాడొచ్చు. 2. మౌత్ వాషర్‌తో అప్పుడప్పుడు నోటిని శుభ్రం చేసుకోవాలి 3. పొగతాగడం, పాన్‌పరాగ్, తమలపాకులు వేయడం మానేయాలి.

1. నోటి దుర్వాసనను పోగొట్టేందుకు వాసనతో కూడిన చూయింగ్‌‌, మౌత్ ఫ్రెష్‌నర్‌లను వాడొచ్చు. 
2. మౌత్ వాషర్‌తో అప్పుడప్పుడు నోటిని శుభ్రం చేసుకోవాలి 
3. పొగతాగడం, పాన్‌పరాగ్, తమలపాకులు వేయడం మానేయాలి. 
 
4. అర లీటర్ నీటిలో పుదీనా రసం (Mint juice), నిమ్మరసం కలిపి ఒక గంటకోసారి పుక్కిలించవచ్చు 
5. నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే నిమ్మరసం, ఉప్పుతో కూడిన నీటిని తాగొచ్చు లేదా పుక్కిలించడం చేయొచ్చు. 
 
6. పేగు సంబంధిత వ్యాధులతోనూ నోటి దుర్వాసన ఏర్పడుతుంది. అందుచేత నిద్రలేచిన వెంటనే కాఫీ, టీలను తాగకుండా నాలుగు గ్లాసుల నీటిని పరగడుపున తీసుకోండి. ఇలాచేస్తే కడుపు శుభ్రం కావడంతో పాటు అల్సర్ తొలగిపోయి నోటి దుర్వాసన ఉండదు. 
7. అలాగే మార్నింగ్, నైట్ పళ్లు తోమడం మంచిది. 
 
8. దంతాలను చిగుళ్లను అప్పడప్పుడు బ్రష్‌తో శుభ్రం చేసుకోండి. 
9. అధికంగా పులుపుతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం మంచిది. 
10. కొత్తిమీర ఆకులను నోటిలో వేసి నమిలితే దుర్వాసన ఉండదు.