గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (21:15 IST)

ఇవి 'కాలక్షేపం' బఠాణీలు కాదు... ఆరోగ్యాన్ని 'కాపు' కాసే బఠాణీలు...

బఠాణీలు ఏదో కాలక్షేపం కోసం తింటుంటారని అనుకుంటారు చాలామంది. కానీ అవి ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. తాజా బఠాణీలు ఫోలిక్ ఆమ్లానికి మంచి నిల్వలుగా వుంటాయి. గర్భం దాల్చడానికి మహిళల కణాల్లో డీఎన్ఎ కోసం ఫోలేట్లు అవసరం. ఇవి బఠాణీల్లో అధికంగా వుంటాయి.

బఠాణీలు ఏదో కాలక్షేపం కోసం తింటుంటారని అనుకుంటారు చాలామంది. కానీ అవి ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. తాజా బఠాణీలు ఫోలిక్ ఆమ్లానికి మంచి నిల్వలుగా వుంటాయి. గర్భం దాల్చడానికి మహిళల కణాల్లో డీఎన్ఎ కోసం ఫోలేట్లు అవసరం. ఇవి బఠాణీల్లో అధికంగా వుంటాయి. అందువల్ల ఆ సమయంలో మహిళలకు వీటిని ఇస్తుంటారు. ఇంకా మరిన్ని ప్రయోజనాలను చూద్దాం.
 
* బఠాణీల్లో పైటోస్టెరాల్స్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. ఇంకా తాజా బఠాణీల్లో విటమిన్ - సి వుంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
 
* బఠాణీల్లో విటమిన్ కె శాతం ఎక్కువగా లభ్యమవుతుంది. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం. అల్జీమర్స్, ఆర్థ్రైటిస్ తదితర వ్యాధులను అరికట్టేందుకు ఇది తోడ్పడుతుంది.
 
* బఠాణీల్లో ఆల్ఫాలినోలిక్ ఆమ్లాల రూపంలో ఓమెగా - 3, ఆమ్లాలు ఓమేగా 6-ఫ్యాటీ ఆమ్లాలు లభ్యమవుతాయి. వీటిల్లో ఉండే కౌమెస్ట్రాల్ అనే పాలీఫినాల్ పొట్ట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని పరిశోధన.
 
* బఠాణీల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది. ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర చేరకుండా వుంటుంది. కనుకనే ఈ బఠాణీలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చూచిస్తుంటారు.