1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 జులై 2016 (13:57 IST)

బియ్యం కడిగిన నీళ్ళతో ఎన్ని లాభాలో తెలుసా?

చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళలో పారబోస్తుంటారు. మరికొందరు అయితే, పశువులకు తాపిస్తుంటారు. నిజానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళతో అనేక లాభాలు ఉన్నట్టు గృహవైద్యులు చెపుతున్నారు. అలాంటి లాభాలేంటో ఓసారి పరిశీలిద

చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళలో పారబోస్తుంటారు. మరికొందరు అయితే, పశువులకు తాపిస్తుంటారు. నిజానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళతో అనేక లాభాలు ఉన్నట్టు గృహవైద్యులు చెపుతున్నారు. అలాంటి లాభాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలతో పాటు... ముఖారవిందాన్ని కూడా పెంచుతుందట. అయితే, ఈ నీటిని నేరుగా ముఖాన్ని కడుక్కోవడం కంటే.. ఒక టిష్యూ పేపర్‌ను నీటిలో ముంచి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ చర్మ తాజాగా మృదువుగా మారుతుందట. ఈ నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా, జట్టుకు కూడా అదనపు సౌదర్యాన్ని అందిస్తాయట.