1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Simple Tips to Get Rid of Dark hand Knees

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

dark patches knee, elbow
చాలా మందికి మోచేతుల కిందవుండే చర్మ నల్లబడిపోయి కనిపిస్తుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, స్కిన్ స్పెషలిస్టులు మాత్రం ఇందుకు చిన్న చిట్కాలు చెబుతున్నారు. 
 
చిన్న గిన్నెలో అర చెంచా బేకింగ్ సోడాను తీసుకుని కొన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. దీన్ని మోచేతులకు పట్టించి అరటిపండు తోక్కతో రుద్దాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తూ ఉంటే క్రమంగా నలుపుదనం విరిగి మోచేతులు ఛాయగా మరతాయి.
 
ఒక బౌల్లో రెండు చెంచాల పుల్లటి పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు పట్టించాలి. పావుగంటసేపు అరనిచ్చి ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లతో మెల్లగా మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే సమస్య తీరుతుంది. 
 
ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు మోచేతులకు కొద్దిగా కలబంద గుజ్జు లేదా కొబ్బరి నూనె రాసుకుంటూ ఉండాలి. వారం రోజుల్లో మోచేతుల మీద ఉన్న చర్మం మృదువుగా మారుతుంది.
 
వాల్నట్ లేదా పిస్తా పెంకులను మెత్తగా సూరి ఆ పొడికి కొద్దిగా కొబ్బరినూనె కలిపి స్క్రబ్ చేయాలి. దీంతో వారానికి రెండుసార్లు మోచేతులపై మర్దన చేయాలి. క్రమంగా మోచే తుల నలుపుదనం విరుగుతుంది. 
About Writer
PNR
తర్వాతి కథనం
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?