1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. These food items can reduce fat from body

ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు కరిగిపోవడం ఖాయం...

food items
ప్రస్తుతకాలంలో చాలామంది రకరకాల కారణాల వల్ల అధిక బరువు పెరిగి లావుగా తయారవుతున్నారు. సరియైన వ్యాయామం లేకపోవటం, సరియైన పోషకాహారం తగు రీతిలో తీసుకోకపోవటం వలన, దీర్ఘకాలంగా మందులు వాడటం వలన కూడా చాలామంది ఊబకాయులుగా తయారవుతున్నారు. దీనివలన రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధికమించాలంటే మన ఆహారంలో తప్పనిసరిగా కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి ఏమిటో చూద్దాం.
 
1. ముదురు రంగు, నలుపు వర్ణం గల పదార్థాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక ఈ పదార్థాలను మన ఆహారంలో చేర్చుకోవటం వలన  సన్నగా, నాజుగ్గా తయారవచ్చు.
 
2. బ్లాక్ టీలో ఐసో పవనాల్స్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. బ్లాక్ టీ ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇది శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించి సన్నగా ఉండేలా చేస్తుంది. 
 
3. రోజు పడుకునేటప్పుడు ఒక గ్లాసు పాలు క్రమంతప్పకుండా తాగడం వలన శరీరం నాజూగ్గా తయారవుతుంది. 
 
4. ప్రతిరోజు ఉదయం రెండు స్పూన్ల తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి మంచి రంగు వస్తుంది. పైత్యము పోయి విరోచనం సాఫీగా అవుతుంది. దీనివలన అధికబరువు కంట్రోల్‌లో ఉంటుంది. 
 
5. బియ్యం, గోధుమలు, జొన్నలు కలిపి చేసిన బ్లాక్ వెనిగర్‌ను వినియోగించడం వల్ల రక్తప్రసరణ అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే?