మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (09:42 IST)

కుమార్తెపై అనుమానం.. కడుపులో 6 కత్తిపోట్లు పొడిచిన తండ్రి

కర్నూలు జిల్లా ఆదోనీలో దారుణం జరిగింది. కుమార్తె ప్రేమలో పడి ఎవరితోనో మొబైల్ ఫోనులో మాట్లాడుతుందన్న అనుమానంతో అత్యంత కిరాతకంగా కడుపులో ఆరు కత్తిపోట్లు పొడిచాడు.

కర్నూలు జిల్లా ఆదోనీలో దారుణం జరిగింది. కుమార్తె ప్రేమలో పడి ఎవరితోనో మొబైల్ ఫోనులో మాట్లాడుతుందన్న అనుమానంతో అత్యంత కిరాతకంగా కడుపులో ఆరు కత్తిపోట్లు పొడిచాడు. దీంతో ఆ యువతి కిందపడి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే అక్కడ నుంచి పారిపోయాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్‌కు చెందిన జాంగిరి అలియాస్‌ ఆటో జానీ అనే వ్యక్తికి అంజలి అనే 16 యేళ్ల కుమార్తె ఉంది. ఈ యువతి శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడుతూ జానీ కంటపడింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న జాంగిరి.. కూతురును అనుమానించి ప్రేమ వ్యవహారం నడుపుతున్నావా? నిలదీశాడు. దీంతో వారిద్దరి మధ్యా వాగ్వాదం జరగడంతో నిగ్రహం కోల్పోయిన జానీ.. ఆమెను చితకబాదాడు. 
 
ఆ దెబ్బలను తట్టుకోలేక అంజలి.. శంకర్‌నగర్‌లోని తన నాయనమ్మ ఇంటి వద్దకు పరిగెత్తింది. ఆమె ఇంటికి తాళం వేసి ఉండడంతో, పక్కనే ఉన్న మేనమామ దుర్గ ఇంటికి వెళ్లి ఘటన గురించి వివరిస్తుండగా.. తండ్రి జాంగిరి అక్కడికి చేరుకుని.. కత్తితో అంజలిపై దాడి చేసి కడుపులో ఆరు పోట్లు పొడిచి పరారయ్యాడు. 
 
దీంతో అంజలి కుప్పకూలిపోయింది. బంధువులు, స్థానికులు ఆమెను హుటాహుటిన ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఆటో జానీ కోసం గాలిస్తున్నారు.