శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By mohan
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (18:46 IST)

కన్న కూతురుని రేప్ చేసిన కామాంధుడు

దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైంది. 17 సంవత్సరాల వయస్సు ఉన్న తనని అనేక సందర్భాల్లో రేప్ చేశాడని ఒక అమ్మాయి తండ్రిపై ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళితే 2010లో తండ్రి తన పట్ల అనుచితంగా ప

దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైంది. 17 సంవత్సరాల వయస్సు ఉన్న తనని అనేక సందర్భాల్లో రేప్ చేశాడని ఒక అమ్మాయి తండ్రిపై ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళితే 2010లో తండ్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఒక అమ్మాయి తల్లికి చెప్పింది. ఆమె కోపంతో తండ్రిని నిలదీయగా, అతడు ఇద్దరినీ చంపుతానని బెదిరించాడు. అమ్మాయి రెండు సార్లు గర్భం దాల్చడమే కాకుండా అబార్షన్ కూడా చేసుకుంది. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
 
అయితే సెప్టెంబర్ 30వ తేదీన ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్‌లు 376(రేప్), 506(బెదిరించడం), పోక్సో చట్టం క్రింద తండ్రిపై వివిధ కేసులు పెట్టారు. ఢిల్లీ పోలీసులు ఎఫిఐఆర్ నమోదు చేశారు. ఆమె 2008వ సంవత్సరంలో మొట్టమెదటి సారి అత్యాచారానికి గురైనట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
అంతేకాకుండా వివిధ సందర్భాల్లో అత్యాచారం చేశాడని కూడా చెప్పింది. తనని చంపుతానని బెదిరించడం వల్ల ఆమె స్నేహితురాలితో నాగపూర్ పారిపోయి, అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు అక్కడ నుండి ఢిల్లీకి కేసును బదిలీ చేశారు. ఇదిలావుండగా కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.