శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:00 IST)

శనిగ్రహ దోషాలు తొలగిపోవాలంటే... వానరాలకు అరటి పండు ఇవ్వాలట..

శనివారం నాడు శని మంత్రాలను జపించి, నీలమణిని ధరించుటవలన శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. నల్లని వస్త్రధారణ నల్లని వస్తువులు దానం చేయటం మంచిది. తీవ్ర వ్యాధులకు కారకుడు శనీశ్వరుడు.

శనివారం నాడు శని మంత్రాలను జపించి, నీలమణిని ధరించుటవలన శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. నల్లని వస్త్రధారణ నల్లని వస్తువులు దానం చేయటం మంచిది. తీవ్ర వ్యాధులకు కారకుడు శనీశ్వరుడు. అలాగే నిద్రలేమి, మత్తు పదార్థాల సేవనం, పిచ్చితనం, స్పర్శపోవటం, శరీరం క్షీణించటం ఇలా ఒకటేమిటి అన్నివ్యాధులకు, కష్టాలకు, నష్టాలకు శనిగ్రహ దోషమే కారణమౌతుంది. 
 
అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని గోచార కాలమందు శనిగ్రహదోషం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రభావాలుంటే.. తప్పకుండా శనివారం పూట శనీశ్వరునికి అర్చన చేయించాలి. శని శాంతి పూజ చేయించాలని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అలాగే శనీశ్వర ప్రభావంతో ఏర్పడే ఈతిబాధలు తొలగిపోవాలంటే.. శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుని ఆరాధన, అయ్యప్ప స్వామి దీక్ష చేయాలి. ఇవి చేస్తే శనిగ్రహ దోషాలు పటాపంచలవుతాయి. ఇంకా నీలం రత్నాన్ని ధరించడం ద్వారా శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. 
 
శని త్రయోదశి రోజుల్లో శనికి అభిషేకం చేయించాలి. అలాగే పేదలకు తమకు చేతనైన సాయం చేయాలి. శనివారం నువ్వులనూనెను తలకు, శరీరం మొత్తం పట్టించి తలంటుస్నానం చేయాలి. శనీశ్వర గాయత్రిని రోజూ 108 సార్లు పఠించాలి. హనుమాన్ చాలీసా చదవాలి. బయటికి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించక ముందు కాలిని బాగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా శనివారాల్లో వానరాలకు అరటిపండును ఇవ్వడం ద్వారా శనీశ్వర దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
 
జాతకంలో జన్మశని జరుగుతుందని జ్యోతిష్యులు చెప్తే ఆ జాతకులు కారైక్కాల్‌లోని తిరునల్లార్ శనీశ్వర స్వామిని దర్శించుకోవడం ఉత్తమం. అలాగే సుశీంద్రం ఆంజనేయుడిని దర్శించుకున్నా.. శనీశ్వర గ్రహ దోష ప్రభావం తగ్గుతుంది. 
 
శనీశ్వరుడిని స్తుతిస్తే.. ఆయనను శాంతింపజేస్తే ఈతిబాధలుండవు. కాలపురుషుని జీవనాధిపతి అయిన శనీశ్వరుడు.. కాలాన్ని అనుగుణంగా మార్చగలిగే శక్తి కలవాడు. అందుకే శనీశ్వరుడిని శనివారం స్తుతించే వారికి, నువ్వుల దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.