శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (12:11 IST)

మతిమరుపుకు దివ్యౌషధంగా పనిచేసే కాఫీ

వృద్ధాప్యంతో సంబంధం లేకుండా చాలామందిని భయపెడుతున్న సమస్య మతిమరుపు. అలాంటి మతిమరుపుకు కాఫీ దివ్యౌషధంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కాఫీలోని కెఫీన్‌తో పాటు అందులో వుండే ఇతరత్రా మూలకాలన్నీ

వృద్ధాప్యంతో సంబంధం లేకుండా చాలామందిని భయపెడుతున్న సమస్య మతిమరుపు. అలాంటి మతిమరుపుకు కాఫీ దివ్యౌషధంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కాఫీలోని కెఫీన్‌తో పాటు  అందులో వుండే ఇతరత్రా మూలకాలన్నీ కూడా మెదడులోని హానికర ప్రోటీన్ల శాతాన్ని తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటుందని పరిశోధకులు తేల్చేశారు. ముఖ్యంగా కాఫీలోని 24 రసాయనాలు ఎన్ఎమ్ఎన్‌ఏటీ2 అనే ఎంజైమ్‌ను విడుదల చేయడం వల్ల మతిమరుపు, అల్జీమర్స్.. లాంటి నాడీ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి.  
 
అయితే కాపీని అధికంగా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా కాఫీ లేదా బ్లాక్‌ కాఫీ రెండు రకాలుగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా పాలు, చక్కెరతో తయారు చేసే కాఫీకి బదులుగా తక్కువ క్యాలరీలున్న బ్లాక్‌ కాఫీ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
 
ఎందుకంటే... ఒక కప్పు బ్లాక్‌ కాఫీలో కేవలం 4.7 క్యాలరీలున్నాయి. అదే రెగ్యులర్‌ కాఫీలో అయితే ఏకంగా 56.6 క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారుబ్లాక్‌ కాఫీ తీసుకోవడమే ఉత్తమం. అలాగే, సాయంత్రం వేళల్లో నిద్ర సమస్యలతో బాధపడేవారు సాధారణ కాఫీ అంతగా తీసుకోకపోవడమే మంచిది. కానీ, ఎసిడిటి ఉన్నవాళ్లు మాత్రం బ్లాక్‌ కాఫీ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.