1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. Sadguru comments for arranged marriage

జాతకం చూడకుండా పెళ్ళి చేయవచ్చా.. గురూజీ?

Sadguru comments for arranged marriage
మీతో జీవించాలనుకునేవారిని, మీరే ఎన్నుకోవాల్సి వుంటుంది. మీ జీవితాన్ని, జ్యోతిష్యం, జాతకం అని ఇతరుల చేతులకు అప్పగిస్తున్నారు. జాతక రీత్యా వారు చేసిన వివాహాలు విడాకులుగా మారలేదని ఎప్పుడైనా మీకు చూపించారా? మీ భర్తతో జీవితం సఖ్యతగా లేకపోతే గ్రహాలపై అపవాదు వేస్తున్నారు. వివాహ జీవితం సఖ్యతగా లేదంటే దానికి కారణం, భార్యాభర్తల మొండితనమే తప్ప గ్రహాలు, ఏమాత్రం కారణం కాదు. భార్యాభర్తలు ఇరువురు మనసువు కలిసి సఖ్యతగా మసలుకుంటే జ్యోతిష్యాలు, గ్రహాలు, నక్షత్రాలు ఏమి చేస్తాయి.
 
పెళ్ళి తర్వాత మీ భాగస్వామిపై అధికారం లభిస్తుందా.. మీ మీద అధికారం చెలాయించబడుతుందా.. అనే భయాన్ని వీడి.. భార్యాభర్తలు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగితోంది. రెండు మనసులు ఒకదాన్ని ఒకటి చేసుకుని, దగ్గరయి, ఒకటైతేనే పెళ్ళి జీవితం సుఖంగా ఉంటుంది. ప్రేమ పంచాల్సిన తరుణంలో ఆదాయాన్ని మాత్రం చూసుకున్నప్పుడే చేదు అనుభవాలు ఎదురవుతాయి. ప్రేమ వికసిస్తే జీవితంలో ఎత్తు పల్లాలు ఎదురైనా జీవితం సుఖంగా సాగిపోతుంది. ఇందుకు జాతకం అడ్డుకాదు.
About Writer
Selvi