సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (08:41 IST)

ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్‌హైమర్... 2024 విజేతలు వీరే..

oppenheimer
ఆస్కార్ 2024 అవార్డులను వెల్లడయ్యాయి. ఇందులో 'ఓపెన్‌హైమర్' చిత్రం అకాడెమీ అవార్డులను కొల్లగొట్టింది. ప్రతిష్టాత్మక 96వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఇందులో 2024 సంవత్సరానికిగాను ఆస్కార్ అవార్డు విజేతల పేర్లను ప్రకటించారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం 'ఓపెన్‌హైమర్' అవార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం ఏకంగా ఏడు అవార్డులను దక్కించుకుంది. 
 
అవార్డు విజేతల వివరాలను పరిశీలిస్తే, 
ఉత్తమ చిత్రం : ఓపన్‌హైమర్ 
ఉత్తమ దర్శకుడు : క్రిస్ట్రోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి : ఎమ్మా స్టోన్ (పూర్ థింక్స్)
ఉత్తమ నటుడు : సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయ నటి : డా 'వైన్ జాయ్ రాండోల్ఫ్' (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయ నటుడు : రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కార్డ్ జెఫెర్సన్ (అమెరికన్ ఫిక్షన్)
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యూకే)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : ది బాయ్ అండ్ ది హెరాన్