1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. Nails eating is a bad habit,

గోళ్లు కొరుక్కోవడం అలవాటుగా మారిపోయింది... ఏం చేయాలి..?

Nails Eating
కొందరు భోజనం చేయకపోయినా భరిస్తారేమోగానీ, గోళ్లు కోరుక్కోకుండా ఉండలేరు. మరి కొందరు అదే పని చిగుళ్లకు కింద వరకూ కొరికేస్తారు. మరికొందరు పొద్దపోకపోతే గోళ్ళు కొరుకుతారు. కొందరు విసుగులోనూ, కోపంలోనూ గోళ్లు కొరికేస్తారు. కొందరు పొద్దుపోకపోతే గోళ్ళు కొరుక్కుంటూ ఉండిపోతారు. అమ్మో గోళ్ళు కొరికే వారు ఇన్ని రకాల జనం ఉన్నారు. అవును మరి.. ఈ అలవాటు కొంప ముంచుతుంది. కొరుకుతూపోతే వేలి చుట్టూ ఉండే చర్మం పుండు పడటంతో పాటు గోరు పెరగటానికి తోడ్పడే కణజాలం దెబ్బతినొచ్చు. మరి ఈ అలవాటు మానుకోవాలంటే ఏం చేయాలి...? 
 
తరచుగా గోళ్లను కత్తిరించుకోవాలి. దానివలన కొరకడానికి ఏమీ మిగలదు. అప్పటికీ అలవాటు మానుకోని పరిస్థితులలో చేదుగా ఉండే పాలీష్ను పూసేయాలి. దీంతో కొరకడంత కొంత వరకూ తగ్గుతుంది.  గోళ్లను అందం తయారు చేసుకుంటే పాడు చేయడం ఎందుకని కొరికే అవకాశం లేకపోవచ్చు. చికాకులో, కోపంలో గోళ్లు కొరికే వారు ధ్యానం, యోగా ద్వారా వాటిని నియంత్రించుకోవాలి. అప్పటికీ మీరు గోళ్ళు కొరకడం మానుకోకపోతే, చేతులకు గ్లవుజులు వేసుకోవటం, వేళ్ల చివర బ్యాండేజీని అంటించటం మంచిది. అదే సమయంలో మానసిక వైద్యులను సంప్రందించడం మంచిది. 
About Writer
pyr