ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

ఆరేళ్ల బుడతడు... పైలట్‌గా విమానం నడిపాడు (వీడియో)

ఆ బుడతడి వయసు ఆరేళ్లు. కానీ, అలవోకగా విమానం నడిపాడు. పేరు అదామ్. అబుదాబి వాసి. చిన్నప్పటి నుంచి విమానాలు నడపాలనే ఆసక్తితో యూట్యూబ్‌లో పైలట్ శిక్షణకు సంబంధించిన వీడియోలన్నీ చూసేశాడు. అదామ్‌కు విమానాలకు

ఆ బుడతడి వయసు ఆరేళ్లు. కానీ, అలవోకగా విమానం నడిపాడు. పేరు అదామ్. అబుదాబి వాసి. చిన్నప్పటి నుంచి విమానాలు నడపాలనే ఆసక్తితో యూట్యూబ్‌లో పైలట్ శిక్షణకు సంబంధించిన వీడియోలన్నీ చూసేశాడు. అదామ్‌కు విమానాలకు సంబంధించిన నాలెడ్జ్‌ను చూసి ఆశ్చర్యపోయిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ సిబ్బంది అడామ్‌కు ఒక్కరోజు పైలట్‌గా ఉండే అవకాశాన్ని కల్పించారు. ఫలితంగా నిజజీవితంలో నిజంగా పైలట్ అవుతాడో లేదో తెలియదు కానీ, తన కలను మాత్రం ఆరేళ్లలోపే తీర్చేసుకున్నాడు. 
 
అదామ్‌ను ఎతిహాద్ ఎయిర్‌వేస్ ట్రెయినింగ్ సెంటర్‌కు పిలిచి.. పైలట్ యూనిఫాం వేసి ఎయిర్‌బస్ ఏ380కు కోపైలట్‌గా అవకాశం ఇచ్చారు. అదామ్‌కు ఉన్న నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయిన కెప్టెన్ సమెరె యాక్‌లెఫ్ అదామ్ విమానం నడిపిస్తుండగా వీడియో తీసి.. ఎయిర్‌వేస్ అధికారుల పర్మిషన్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 
 
ఆ వీడియోను ఇప్పటివరకు కోట్లాది మంది వీక్షించారు. అంతేకాదు ఆ చిన్నారి ఖచ్చితంగా భవిష్యత్తులో పైలట్ అవుతాడని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఏ-380 ఎయిర్‌బస్‌కు కెప్టెన్ అవ్వడమే తన లక్ష్యమని ఆదామ్ కూడా విశ్వాసంతో చెపుతున్నాడు.