బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 అక్టోబరు 2017 (21:16 IST)

కర్నాటకలో మరో 'డేరా బాబా'... నటితో రాసలీలలు... వీడియో లీక్

కర్నాటకలో మరో డేరా బాబా రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతడు ఓ నటితో రాసలీలలు సాగిస్తుండగా తీసిన వీడియో కాస్తా లీక్ అయ్యింది. ఇది సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేయడంతో ఇప్పుడు దీనిపై కర్నాటకలో తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాలను చూస్తే... కర్నా

కర్నాటకలో మరో డేరా బాబా రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతడు ఓ నటితో రాసలీలలు సాగిస్తుండగా తీసిన వీడియో కాస్తా లీక్ అయ్యింది. ఇది సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేయడంతో ఇప్పుడు దీనిపై కర్నాటకలో తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాలను చూస్తే... కర్నాటక లోని ఎల్లంక ప్రాంతంలోని మద్దెవనపుర మఠ ఆశ్రమానికి చెందిన పర్వతరాజ్ శివాచార్య స్వామి నుంచి వారసత్వంగా బాధ్యతలను ఆయన తనయుడు నంజేశ్వర స్వామిజీ అలియాస్ దయానంద్ స్వీకరించాడు. 
 
ఇతడు బాధ్యతలు తీసుకున్న దగ్గర్నుంచి మఠం ప్రతిష్ట మసకబారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కాస్తా వాస్తవరూపంలో వీడియో ద్వారా బహిర్గతమయ్యాయి. దయానంద కన్నడలో మూడు చిత్రాల్లో నటించిన ఓ నటితో అభ్యంతరకర భంగిమలో పడకగదిలో వుండగా తీసిన వీడియో బయటకు వచ్చింది. 
 
సదరు నటి స్వామీజీపై కావాలనే పక్కా ప్లానుతో ఈ వ్యవహారంలో ఇరికించిందనీ, నటికి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో ఏదో తేడా రావడంతో ఆమె ఇలా చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోను కూడా సదరు నటే లీక్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. కాగా దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.