బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (21:01 IST)

ఆప్ఘనిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు

ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ శనివారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

పేలుళ్లలో భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మొదటి పేలుడు ఉదయం 6 గంటల సమయంలో  పీడీ -5 (పోలీసు జిల్లా-5) లోని సరక్-ఎ-నవ్ ప్రాంతంలో జరిగింది.

ఈ పేలుడులో భద్రతా దళంలోని ఓ సభ్యుడు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. రెండో పేలుడు ఉదయం 7 గంటలకు పీడీ-15 పరిధిలోని హంగర్హా రౌండ్అబౌట్లో జరగ్గా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ పేలుడు జరిపారు. పీడీ- 5లోని కంపెనీ ప్రాంతంలో మూడవ పేలుడు జరగ్గా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.