శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (13:00 IST)

ఆప్ఘనిస్థాన్‌లో వరుస దాడులు.. 17మంది మృతి.. తాలిబన్ల చర్యే

ఆప్ఘనిస్థాన్‌లో చోటుచేసుకున్న వరుస దాడుల కారణంగా 17మంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్లకు, అధికారపక్షానికి మధ్య చర్చలు జరగాల్సిన తరుణంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి.

మంగళవారం ఉత్తర బాల్క్‌ ప్రావిన్స్‌లో ట్రక్‌ సూసైడ్‌ బాంబర్‌ దాడిలో ఇద్దరు అఫ్గాన్‌ కమాండోలు, ఒక పౌరుడు మరణించారు. మరో ఆరుగురు కమాండోలు, 35మంది పౌరులు గాయపడ్డారు. డజనుకుపైగా గృహాలు దెబ్బతిన్నాయి. 
 
ఈ దాడికి తామే కారణమని తాలిబన్‌ ప్రతినిధి జబుల్లా ముజాహిత్‌ ఇప్పటికే ప్రకటించారు. బాల్క్‌లోనే మరో ఘటనలో ఒక గన్‌మెన్‌ ఐదుగురిని కాల్చిచంపాడు. ఘోర్‌ ప్రావిన్స్‌లోని చెక్‌పాయింట్‌ వద్ద జరిగిన మరోదాడిలో 8మంది సైనికులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.
 
రాజధాని కాబూల్‌లో జరిగిన బాంబుదాడిలో ఒక పోలీసు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరోపక్క ఆప్ఘనిస్థాన్ ఆర్మీ జరిపిన వైమానిక, సైనిక దాడుల్లో 91మంది తాలిబన్లు మరణించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరో 50 మంది తాలిబన్లు గాయపడ్డట్లు సమాచారం.