శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (14:26 IST)

టాయ్‌లెట్ పేపర్లపై ట్రంప్ ముఖం - చేసిందెవరో తెలుసా..?

ఎప్పుడూ వివాదాల్లో నిలిచే అమెజాన్ మళ్ళీ అదే పని చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను అమెజాన్ టాయిలెట్ పేపర్లపై ముద్రించింది. ముద్రించిన వాటిలో ట్రంప్ ముఖం కూడ

ఎప్పుడూ వివాదాల్లో నిలిచే అమెజాన్ మళ్ళీ అదే పని చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను అమెజాన్ టాయిలెట్ పేపర్లపై ముద్రించింది. ముద్రించిన వాటిలో ట్రంప్ ముఖం కూడా ఉంది. ఈ టాయ్‌లెట్ పేపర్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. రెండురోజుల క్రితం తయారుచేసిన పేపర్లు అయిపోవడంతో కొత్తవి తయారుచేయిస్తున్నారట.
 
ఒక దేశానికి అధ్యక్షుడు అన్న ఆలోచన కూడా లేకుండా అమెజాన్ ఈ విధంగా ప్రవర్తించడంపై సామాజిక మాథ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయట. అలాగే ట్రంప్ ముఖం ఉన్న టాయిలెట్ రోల్ స్టాకర్‌ను కూడా అమెజాన్ ఉత్పత్తులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెజాన్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. ఇప్పటికే కొన్ని వివాదాలకు కారణమైంది ఈ ఆన్‌లైన్ సంస్ధ అమెజాన్.