శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 6 మార్చి 2017 (13:59 IST)

నా భర్తను పెళ్లాడరూ...? ఓ భార్య అభ్యర్థన, ఎందుకు?

సినిమాల్లోనే ఇలాంటి మాటలు వింటుంటాం. నిజ జీవితంలో ఎవ్వరూ తన భర్తను మరొకరికి కట్టబెట్టాలని చూడరు. కానీ ఆమె ఆ నిర్ణయానికి వచ్చేసింది. దీనికి కారణం... ఆమె మరణం అంచున వుండటమే. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ ఆమె ప్రాణాలను కబళించే రోజులు దగ్గరకి వచ్చేశాయని తెల

సినిమాల్లోనే ఇలాంటి మాటలు వింటుంటాం. నిజ జీవితంలో ఎవ్వరూ తన భర్తను మరొకరికి కట్టబెట్టాలని చూడరు. కానీ ఆమె ఆ నిర్ణయానికి వచ్చేసింది. దీనికి కారణం... ఆమె మరణం అంచున వుండటమే. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ ఆమె ప్రాణాలను కబళించే రోజులు దగ్గరకి వచ్చేశాయని తెలుసుకున్న ప్రముఖ రచయిత్రి అమీ క్రూజ్ రోసెంతాల్ తన చనిపోబోయే ముందు తన భర్తకు మరో భాగస్వామిని కట్టబెట్టాలని నిర్ణయించుకుంది. 
 
తన ఆలోచనకు కార్యరూపం తీసుకువస్తూ.. 'యూ మె వాంట్ టు మ్యారీ మై హస్బెండ్' పేరుతో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో హృదయాన్ని కదిలించే ఓ వ్యాసం రాసింది. ఆ వ్యాసంలో తన భర్త ఎంతటి మంచివాడో వివరించింది. తన భర్త జాసస్ ఓ న్యాయవాదనీ, అతనితో 26 ఏళ్లుగా కలిసి కాపురం చేస్తున్నాని తెలిపింది. ఇంకా మరో 26 ఏళ్లు అతడితో జీవించాలని వున్నా దేవుడు తనకు ఆ అవకాశం ఇవ్వడంలేదనీ, అంత మంచి భర్తను వదిలి వెళ్లిపోయేందుకు ఎంతో బాధగా వున్నా విధి రాతను ఎవ్వరూ తప్పించలేరని వెల్లడించింది. 
 
అందుకే తను ఓ మంచి మనిషిని భర్తగా చేసుకోమ్మని అడుగుతున్నాననీ, ఓ కలల రాకుమారుడి కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే తన భర్త జాసన్ తగిన వ్యక్తి అవుతాడని ఆమీ క్రూజ్ పేర్కొన్నారు. ఈ వ్యాసం చదివినవారు కంటతడి పెట్టుకుంటున్నారు. ఈమె రాసిన ఈ వ్యాసం సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వైరల్‌గా మారింది.