శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 డిశెంబరు 2020 (08:28 IST)

అంతరిక్షంలో ముల్లంగి సాగు : కేట్ రూబిన్స్ వ్యోమగామి కృషి సక్సెస్

అంతరిక్షంలో కూడా కూరగాయలు పండించవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన కేట్ రూబిన్స్ అనే వ్యోమగామి నిరూపించింది. పైగా, ఈమె కృషి ఫలితంగా ముల్లంగిని పండించింది. తద్వారా భవిష్యత్తులో అంతరిక్షంలో కూడా కూరగాయలు పండించవచ్చని నిరూపించింది. 
 
ఇటీవల నాసా ఓ ప్రయోగాన్ని చేపట్టింది. అదే.. అంతరిక్షంలో కూరగాయలను పండించడం. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో(ఐఎస్‌ఎస్‌) మైక్రోగ్రావిటీ ఛాంబర్‌లో కేట్‌ రూబిన్స్‌ అనే వ్యోమగామి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ముల్లంగి మొక్కలను మొలిపించారు. 
 
ఆ తర్వాత ముల్లంగి కూరగాయలు విజయవంతంగా వచ్చాయి. ముల్లంగి మొక్కలు ఉన్న ఛాంబర్‌ ఫొటోలను కేట్‌ రూబిన్స్‌ అనే వ్యోమగామి విడుదల చేశారు. చంద్రుడు, అంగారకుడి మీద కూడా గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ ఉంటుందన్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో వ్యోమగాములకు తాజా ఆహారం అందించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వచ్చేఏడాది ఈమొక్కలను భూమి మీదకు తీసుకురానున్నారు. ముల్లంగి వేగంగా పెరగడంతో పాటు శాస్త్రీయ అధ్యయనానికి సులభంగా ఉంటుంది.