మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

ఉద్యోగులకు రూ.10 లక్షల డాలర్లు బోనస్ ప్రకటించిన లేడీబాస్

australian-boss
కరోనా తర్వాత అనేక కంపెనీలు తమ సంస్థల్లో పని చేస్తున్న వారిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ నుంచి షార్ట్ మెసేజింగ్ యాప్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా అనేక అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. పైగా, కంపెనీలు అట్టిపెట్టుకున్న ఉద్యోగుల ఉద్యోగాలకు కూడా గ్యారెంటీలేదు. ఎపుడు ఉద్యోగం ఊడిపోతుందోనన్న భయం వెంటాడుతుంది. 
 
ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన మైనింగ్ లేడీ క్వీన్ తన సంస్థల్లో పని చేసే పది మంది ఉద్యోగులను ఎంపిక చేసిన వారికి లక్ష అమెరికన్ డాలర్లు చొప్పున క్రిస్మస్ బోనస్ ప్రకటించారు. అంటే భారతీయ కరెన్సీలో 83 లక్షల రూపాయలు. ఆమె ప్రకటన వినగానే ఉద్యోగులంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 
 
ఆస్ట్రేలియాలోని హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి జార్జినా రెన్‌హార్ట్ అనే మహిళ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్‌, డైరెక్టరుగా కొనసాగుతున్నారు. మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచిన ఆమె 34 బిలియన్ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటుదక్కించుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల ఆమె తండ్రి స్థాపించిన హాన్‌కాక్ ప్రాస్సెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ అనే మరో సంస్థలోని ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంస్థలో పని చేసే  ఉద్యోగుల్లో అత్యుత్తమంగా సేవలు అందించిన తొలి పంది మంది పేర్లను చదివి వినిపించారు. 
 
ఆమె పేర్లు చదువుతుంటే, ఆ పేర్లు ఉన్నవారు మాత్రం తమకు ఉద్యోగం ఊడిపోయిందని భావించారు. కానీ, ఆఖరులో ఈ పేర్లు చదివిన పది మందికి లక్ష అమెరికన్ డాలర్ల చొప్పున బోనస్ ప్రకటిస్తున్నట్టు తెలిపి, వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 
 
భారతీయ కరెన్సీలో దాదాపు రూ.80 లక్షల మేరకు బోనస్ అందుకోబోతున్న పది మందిలో మూడు నెలల క్రితమే కంపెనీలో చేరిన ఓ ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం. కాగా ఈ కంపెనీ ఒకయేడాదిలో ఏకంగా 3.3 బిలియన్ డాలర్ల లాభాన్ని అర్జించిపెట్టింది.