శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (08:34 IST)

మహిళా జర్నలిస్టును చంపేశారు.. ఎందుకంటే...

బంగ్లాదేశ్‌లో ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. అదీ ఆమె ఇంట్లోనే పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య వెనుక ఆమె భర్త ఉన్నట్టు పోలీసులు సందేహిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.

బంగ్లాదేశ్‌లో ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. అదీ ఆమె ఇంట్లోనే పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య వెనుక ఆమె భర్త ఉన్నట్టు పోలీసులు సందేహిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.
 
బంగ్లాదేశ్‌కు చెందిన సుబర్నా అఖ్తర్ నోడి (32) అనే మహిళ జర్నలిస్టుగా పని చేస్తోంది. ఈమె ఆనంద అనే ప్రైవేట్ న్యూస్ చానెల్‌తోపాటు జాగ్రోతో బంగ్లా అనే దినపత్రిక కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా భర్తతో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తన 9 యేళ్ళ కుమార్తెతో కలిసి పాబ్నా జిల్లా రాధానగర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో 12 మంది దుండగులు ఆమె ఇంటికొచ్చి బెల్ కొట్టారు. డోర్ తీసిన ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి లోపలికి వెళ్లేందుకు వెనుదిరిగింది. అంతే.. ఒక్కసారిగా పదునైన ఆయుధాలతో దుండగులు ఆమెపై దాడి చేశారు. 
 
ఆ తర్వాత ద్విచక్రవాహనాలపై పారిపోయారు. రక్తమడుగులో ఉన్న సుబర్నాను స్థానికులు దవాఖానకు తరలించగా, అప్పటికే ఆమె చనిపోయింది. కాగా, సుబర్నా హత్య వెనుక భర్త రజిబ్ హుస్సేన్, మామ అబ్దుల్ హుస్సేన్ హస్తం ఉందని మృతురాలి బంధువులు ఆరోపించారు.