గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2016 (16:08 IST)

డొనాల్డ్ ట్రంప్‌కు ఒబామా చెక్: ఎన్ఎస్ఈఈఆర్ఎస్ చట్టం రద్దు.. ముస్లింలపై?

ముస్లింలపై అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద ప్రభావిత దేశాల నుంచి వచ్చే యాత్రికులను నిరోధించేందుకు 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా న

ముస్లింలపై అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద ప్రభావిత దేశాల నుంచి వచ్చే యాత్రికులను నిరోధించేందుకు 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఎంట్రీ - ఎక్సిట్ రిజిస్ట్రేషన్ సిస్టం(ఎన్ఎస్ఈఈఆర్ఎస్)ను అమెరికా అమల్లోకి తెచ్చింది.

ఈ ప్రోగ్రాం ప్రకారం టెర్రరిస్టు దేశాల నుంచి అమెరికాకు వచ్చే సందర్శకులపై 2001-2011ల మధ్య ఆంక్షలు ఉండేవి. బెర్లిన్ ఉగ్ర దాడి అనంతరం ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ ముస్లిం సందర్శకులపై కొంతకాలం పాటు నిషేధం విధించాలని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు అవునని సమాధానం ఇచ్చారు. 
 
అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా ఒబామా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం దేశాల సందర్శకులపై ఆంక్షలు విధించే ఎన్ఎస్ఈఈఆర్ఎస్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాదులెవరో గుర్తించడానికి విమానాశ్రయాల్లో ఉండే భద్రతా వ్యవస్ధ సరిపోతుందని హోం ల్యాండ్ సెక్యూరిటీ ఐజీ పేర్కొన్నారు.

ఇప్పటికే ఎన్ఎస్ఈఈఆర్ఎస్ కింద మొదట ఇరాక్, ఇరాన్, లిబియా, సుడాన్, సిరియాలకు చెందిన వారిపై ఆంక్షలు విధించగా.. తర్వాత ఆఫ్రికా, మధ్య ఆసియాల్లోని మరో 25 దేశాలపై ఆంక్షలు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత రద్దుతో ఆంక్షలు తొలగిపోనున్నాయి.