1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 24 మే 2025 (16:39 IST)

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

Soumith Rao and team
Soumith Rao and team
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా న‌టించిన ‘నిలవే’  చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్ సినీ టెక్‌ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి పాత్రల్ని పరిచయం చేశారు. సంతోషం, నమ్మకం, అలక, పిలుపు అంటూ అన్ని రకాల ఎమోషన్స్‌కు సంబంధించిన ‘నిలవే’ పోస్టర్‌లను రిలీజ్ చేశారు.

Left to Right = Lateef - Asst Director, Satish Kanchetti - Production Manager, Koti - Additional Lyrics, Anvesh Perati - Executive Producer, Venkat NKK - Co-Production,  Kalyan Nayak - Music Director, Sai Vennam - Director & Producer, Sowmith Rao - A
Left to Right = Lateef - Asst Director, Satish Kanchetti - Production Manager, Koti - Additional Lyrics, Anvesh Perati - Executive Producer, Venkat NKK - Co-Production, Kalyan Nayak - Music Director, Sai Vennam - Director & Producer, Sowmith Rao - A
అనంతరం హీరో సౌమిత్ రావు మాట్లాడుతూ .. ‘‘నిలవే’ ఓ మంచి మ్యూజికల్ లవ్ డ్రామాగా రాబోతోంది. అంతా కొత్త వాళ్లం కలిసి చేస్తున్నాం. కొత్త వాళ్లు కూడా మంచి చిత్రాలను తీస్తారు. మేం ఎంతో నిజాయితీతో ఈ మూవీని చేశాం. మా కంటెంట్ బాగుందని ఆడియెన్స్ చెప్పాలి. మా సినిమా బాగుందని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మా మూవీని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లేందుకు మీడియా సహకరించాలి. నిజాయితీకి అర్థం ఉంటే అది మా ‘నిలవే’ సినిమా. మా చిత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు. 
 
దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ .. ‘మా పేర్లు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. మాది చిన్న టీం కావొచ్చు. కానీ మా కాన్సెప్ట్, మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక అందమైన ప్రేమ కథ. ఓ వ్యక్తి జీవితంలో జరిగే ప్రయాణమే ‘నిలవే’. మ్యూజిక్‌ని లవ్‌తో చూపించాలని అనుకున్నాం. మేం కథ పైన ప్రేమతో ఎంతో కష్టపడి ‘నిలవే’ చిత్రాన్ని తీశాం. టీజర్ చూస్తే నిజాయతీగా ఉంటుంది. ఎక్స్‌పోజింగ్ లేదని, డైలాగుల్లో బూతులు లేవని, వైరల్ అవ్వదని చాలా మంది చెప్పారు. కానీ మా కంటెంట్ మాత్రమే చెప్పాలని టీజర్ కట్ చేశాం. ‘నిలవే’ చాలా మంచి సినిమా. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ .. ‘‘నిలవే’ టైంకి నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ నా మీద నమ్మకంతో సినిమాను ఇచ్చారు. ఈ మూవీకి కొత్త మ్యూజిక్‌ను ఇచ్చాం. సినిమా, కథ నుంచే ఇంత మంచి సంగీతం వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ మూవీని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మంచి చిత్రానికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
కెమెరామెన్ దిలీప్ కే కుమార్ మాట్లాడుతూ .. ‘‘నిలవే’ లాంటి మంచి చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. ‘నిలవే’ మ్యూజిక్ విన్న తరువాత దానికి తగ్గ విజువల్స్ ఇవ్వడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. మా సినిమాకు అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
లిరిక్ రైటర్ ఎమ్‌వి.ఎస్. భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘సౌమిత్ రావు, నేను కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తిరిగాం. అప్పటి నుంచి ఈ కాన్సెస్ట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇందులో పెద్ద బడ్జెట్, క్యాస్టింగ్ లేకపోవచ్చు.. కానీ పెద్ద డ్రీమ్, మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చాలా మంచి చిత్రం అవుతుంది. సినిమా చూశాక నచ్చితేనే అందరూ  సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
లిరిక్ రైటర్ కోటి మాట్లాడుతూ .. ‘‘నిలవే’ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. కళ్యాణ్ అన్న మంచి సంగీతాన్ని అందించారు. ఇందులో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు సౌమిత్ అన్నకి, సాయి అన్నకి థాంక్స్. ఈ చిత్రం అందరినీ కచ్చితంగా కదిలిస్తుంది. అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
 
నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత మరియు ఇతరులు.