శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (09:22 IST)

ప్లాస్టిక్ బాటిల్స్ రీ సైక్లింగ్‌తో దుప్పట్ల తయారీ.. ఆ ఫ్లైట్‌ ప్రయాణికులకు ఇచ్చేవి అవేనట!

ప్లాస్టిక్ బాటిల్స్‌ రీ సైక్లింగ్‌తో దుప్పట్లు తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసేది ఓ వ్యాపార సంస్థో కాదు. ఓ దేశ విమానయాన సంస్థ. పేరు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ. ఈ సంస్థ ప్లాస్టిక్ బ

ప్లాస్టిక్ బాటిల్స్‌ రీ సైక్లింగ్‌తో దుప్పట్లు తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసేది ఓ వ్యాపార సంస్థో కాదు. ఓ దేశ విమానయాన సంస్థ. పేరు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ. ఈ సంస్థ ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీ సైక్లింగ్ చేసి దుప్పట్లు ఇస్తున్నట్టు తేలింది. 
 
పర్యావరణానికి భారంగా మారుతున్న ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీ సైకిల్ చేయడం ద్వారా ఈ దుప్పట్లను  తయారు చేస్తోంది. మొదట.. బాటిల్స్‌ను రీ సైకిల్ చేసి ప్లాస్టిక్ చిప్స్ రూపంలోకి తీసుకువస్తారు. ఆ తర్వాత వాటి నుంచి పోలార్ ప్లీస్ మెటీరియల్ ఉత్పత్తి చేసి, దానిలోని మృదువైన దారాలతో దుప్పట్లు తయారు చేస్తారు. ఈ దుప్పట్లను ఆస్ట్రేలియాకు చెందిన ‘బజ్’ అనే సంస్థ భాగస్వామ్యంతో ఎమిరేట్స్ సంస్థ తయారు చేస్తోంది. 
 
‘ఎమిరేట్స్’లో ఎకానమీ క్లాసు ప్రయాణికులకు ఈ దుప్పట్లను ఇస్తున్నామని, 28 ప్లాస్టిక్ బాటిల్స్‌తో ఒక దుప్పటిని తయారు చేయవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భూమికి భారంగా, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ బాటిల్స్‌ను అలా వదిలివేయకుండా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వీటి తయారీని ప్రారంభించామని,  2019 నాటికి ఎకో-త్రెడ్ దుప్పట్ల తయారీకి 88 మిలియన్ల ప్లాస్టిక్ బాటిల్స్‌ను వినియోగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు.