శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 జనవరి 2021 (18:42 IST)

కోవిడ్- 19పై పోరుకి బిల్ అండ్ మెలిండా గేట్స్ 1.75 బిలియన్ డాలర్స్ సాయం

సియాటిల్: బిల్ మరియు మెలిండా గేట్స్ తమ వార్షిక లేఖ, ‘‘ప్రపంచ ఆరోగ్య రంగం స్థానిక బాట పట్టిన సంవత్సరం’’ను నేడు విడుదల చేశారు. ఈ వార్షిక లేఖలో, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ప్రభావం అలాగే ప్రపంచ భాగస్వామ్యం మరియు శాస్త్ర, సాంకేతిక నవకల్పన అనేది మానవాళి చరిత్రలోకెల్లా అతిపెద్ద ప్రజారోగ్య ప్రయత్నాల్లో ఒకటిగా నిలిచిన ఈ అంశాన్ని బిల్ మరియు మెలిండా తెలియజేశారు.
 
ఈ మహమ్మారి బారి నుంచి ప్రపంచం శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, అలాగే మరింత ధీటుగా బయటపడే విషయంలో తాము ఎందుకు ఆశావహంగా ఉన్నామనే దానిపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి అత్యంత ఆవశ్యకమని తాము భావిస్తున్న రెండు విభాగాలు... సమానత్వానికి ప్రాధాన్యత మరియు తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండటం గురించి చర్చించారు.
 
‘‘కోవిడ్-19 ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది, కోట్లాది మంది ప్రజలను అనారోగ్యానికి గురిచేసింది, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అత్యంత ఘోరమైన మాంద్యంలోకి నెట్టివేసింది’’ అని బిల్ మరియు మెలిండా గేట్స్ లేఖలో రాశారు. ‘‘రికవరీకి సంబంధించి మనం ఇంకా సుదీర్ఘమైన ప్రయాణం చేయాల్సిన ఉన్నప్పటికీ, ఈ వైరస్‌పై పోరాటంలో కొత్త పరీక్షలు, చికిత్సలు, మరియు వ్యాక్సిన్‌ల రూపంలో ప్రపంచం కొన్ని కీలకమైన విజయాలను సాధించింది. ఈ కొత్త సాధనాలు త్వరలోనే పెద్దయెత్తున వైరస్ వ్యాప్తిని అరికట్టడాన్ని మొదలుపెడతాయని మేము విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
 
మహమ్మారిపై పోరులో భాగంగా, దాతలు ప్రపంచం నలుమూలల నుంచీ వనరులను సమకూర్చారు, పోటీదారులు తమ పరిశోధన ఫలితాలను పంచుకున్నారు, అలాగే ఏళ్ల కొద్దీ చేస్తున్న ప్రపంచ పెట్టుబడులు వ్యాక్సిన్ అభివృద్ధికి మరియు రికార్డు సమయంలో సమర్థవంతంగా, సురక్షితంగా వ్యాక్సిన్‌లను పంపిణీ చేయడంలో కొత్త శకానికి నాంది పలకడంలో దోహదం చేశాయని బిల్ మరియు మెలిండా గేట్స్ వివరించారు.
 
అయితే, ఈ మహమ్మారి ఇప్పటికే నెలకొన్న ఆరోగ్య అసమానతలను, మరీ ముఖ్యంగా అత్యవసర కార్మికులు, భిన్న వర్ణాల ప్రజలు, నిరుపేదలు, మరియు మహిళల విషయంలో మరింత ఉధృతం చేసిందని వారు హెచ్చరించారు. ఈ మహమ్మారి వ్యాధి నిరోధకత అసమానత అనే మరో రకమైన అన్యాయం విస్తరించేందుకు కూడా కారణం కావచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ కారణంగా తలెత్తిన అసమాన సామాజిక మరియు ఆర్థిక ప్రభావాలను పరిష్కరించడానికి సమ్మిళిత ప్రతిస్పందన అవసరమని వారు పిలుపునిచ్చారు.
 
‘‘మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ, కోవిడ్-19 అనేది అన్నిచోట్లా తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ మేము సంపన్న దేశాలను అభ్యర్ధించాం. వ్యాక్సిన్‌లు అందరికీ లభించేంత వరకూ, ఈ వ్యాధి కొత్త ప్రాంతాల్లో పుట్టుకొస్తూనే ఉంటుంది. అసమానత చక్రం కొనసాగుతూనే ఉంటుంది’’ అని మెలిండా లేఖలో రాశారు. ‘‘2020లో అభివృద్ధి చేసిన ప్రాణాధార శాస్త్ర సాకేంతికత అనేది 2021లో సాధ్యమైనంత మేరకు ఎంత మందిని రక్షిస్తుందనే భరోసా కల్పించేందుకు ప్రపంచం కలిసికట్టుగా ఎలా ముందుకొస్తుందనే దానిపైనే మొత్తమంతా ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
 
తదుపరి మహమ్మారి గురించి ఆలోచించడం అనేది తొందరపాటు కానేకాదని కూడా బిల్ మరియు మెలిండా నొక్కిచెప్పారు. అలాగే దీన్ని అరికట్టేందుకు ఏటా పదులకొద్దీ బిలియన్ల డాలర్లను వెచ్చించాల్సిన రావచ్చని పేర్కొంటూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం దాదాపు 28 ట్రిలియన్ డాలర్ల మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, మరియు వ్యాక్సిన్‌లపై పెట్టుబడులను కొనసాగించాలని వారు అభ్యర్ధించారు, అలాగే వ్యాధులు పుట్టుకొచ్చిన వెంటనే వాటిని గుర్తించగలిగే విధంగా ప్రపంచ అప్రమత్తత వ్యవస్థ ప్రాముఖ్యత గురించి చర్చించారు.
 
‘‘మహమ్మారులను మనం ఎంత తీవ్రంగా పరిగణించాలనే విషయం ప్రపంచానికి ఇప్పుడు తెలిసొచ్చింది’’ అని బిల్ అభిప్రాయపడ్డారు. ‘‘మనం ఇప్పటికే కొత్త మహమ్మారులను ఎదుర్కొనే సంసిద్ధత వ్యూహాలు పుట్టుకురావడాన్ని చూస్తున్నాం అలాగే రానున్న నెలలు మరియు సంవత్సరాల్లో ఇలాంటివి మరిన్ని వచ్చే అవకాశం ఉంది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రపంచం సిద్ధంగా లేదు. మరోసారి ఇలాంటివి వస్తే అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుందని నేను భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
 
ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యవంతమైన జీవనం అలాగే ఉత్పాదకతతో కూడిన జీవితాన్ని పొందేందుకు అర్హుడు అన్న సంకల్పంతో ద బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఇప్పటివరకూ, ఈ ఫౌండేషన్ కోవిడ్-19పై పోరు కోసం 1.75 బిలియన్ డాలర్ల మొత్తాన్ని సమకూర్చుతున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్‌లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మరియు చికిత్సల అభివృద్ధి అలాగే నిష్పాక్షికంగా వాటిని అందించడంలో భాగస్వాములకు తగిన చేదోడునివ్వడం ఈ సహాయంలో భాగంగా ఉన్నాయి.