గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2021
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (18:33 IST)

బడ్జెట్-2021: Union Budget Mobile App విడుదల..

Union Budget Mobile App
బడ్జెట్-2021 ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్దమవుతోంది. త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌- 2021 ప్రతులను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గతంలోనూ బడ్జెట్‌ పత్రాలను వెబ్‌సైట్‌లో పొందే వీలున్నా.. దాన్ని మరింత సులభతరం చేస్తూ, మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఈ యాప్‌ను తీసుకొచ్చారు. 
 
ఇటీవల హల్వా వేడుక సందర్భంగా Union Budget Mobile Appను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) దీన్ని రూపొందించింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ యాప్‌లో బడ్జెట్‌ పత్రాలు అందుబాటులోకి వస్తాయి.
 
* బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రసంగం, వార్షిక ఆర్థిక నివేదిక, ఆర్థిక బిల్లు.. ఇలా 14 రకాల బడ్జెట్‌ పత్రాలను ఈ యాప్‌లో పొందొచ్చు.
* హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పత్రాలు అందుబాటులో ఉంటాయి.
* మొబైల్‌లో బడ్జెట్‌ పత్రాలను వీక్షించడమే కాక.. డౌన్‌లోడ్‌ చేసుకునే వీలూ ఉంది. పత్రాలను ప్రింట్‌ చేసుకోవచ్చు కూడా.
* జూమ్‌ ఇన్‌, జూమ్‌ ఔట్‌ ఫీచర్ల ద్వారా సులువుగా చదువుకోవచ్చు. బడ్జెట్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్‌ చేసే వెసులుబాటూ కల్పించారు.
* బడ్జెట్‌లో భాగంగా ఉదహరించిన ఇతర లింకులనూ యాక్సెస్‌ చేయొచ్చు.