మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (15:59 IST)

'బ్లూ వేల్ చాలెంజ్'.. ఇదో ఆన్‌లైన్‌ సూసైడ్ గేమ్ (వీడియో)

ఇప్పటివరకు వివిధ రకాల గేమ్‌లు చూసివుంటారు. వాటి పేర్లూ వినివుంటారు. కానీ, ఇపుడు 'బ్లూ వేల్ చాలెంజ్' అనే ఓ కొత్త ఆన్‌లైన్ సూసైడ్ గేమ్ వెలుగులోకి వచ్చింది. రష్యాలో ప్రారంభమైన ఈ గేమ్ ఇపుడు ప్రపంచ వ్యాప్త

ఇప్పటివరకు వివిధ రకాల గేమ్‌లు చూసివుంటారు. వాటి పేర్లూ వినివుంటారు. కానీ, ఇపుడు 'బ్లూ వేల్ చాలెంజ్' అనే ఓ కొత్త ఆన్‌లైన్ సూసైడ్ గేమ్ వెలుగులోకి వచ్చింది. రష్యాలో ప్రారంభమైన ఈ గేమ్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిలీలో ఈ గేమ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ గేమ్ బారినపడి అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబ‌ైలో ఓ 14 ఏళ్ల అబ్బాయి సూసైడ్ చేసుకున్న విషయం తెల్సిందే. అంధేరి ఈస్ట్‌లో ఉండే ఆ చిన్నారి సోష‌ల్ మీడియాలో ఈ గేమ్ గురించి తెలుసుకుని గేమ్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత ఎలాగైనా ఈ గేమ్‌లో విన్ అవ్వాల‌ని తను ఉండే బిల్డింగ్‌లో ఐదో అంతస్థు నుంచి కిందికి దూకి త‌న ప్రాణాల‌ను తీసుకున్నాడు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, సూసైడ్ చేసుకున్న చిన్నారికి బ్లూ వేల్ చాలెంజ్‌కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో భారత్‌లో కూడా ఈ గేమ్ ఆడుతున్న వారు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ గేమ్ బారిన ప‌డి ర‌ష్యా, యూకేలో ఇప్ప‌టికే దాదాపు 130 మంది చిన్నారులు త‌మ ప్రాణాల‌ను కోల్పోవడం గమనార్హం. 
 
అసలు బ్లూ వేల్ చాలెంజ్ గేమ్ ర‌ష్యా‌లో ప్రారంభ‌మైంది. ఇది ఇప్పుడు భారత్‌కు పాకింది. నీలి తిమింగ‌లం చాలెంజ్ గేమ్‌ను ఓ సోష‌ల్ మీడియా గ్రూప్ ర‌న్ చేస్తుంటుంది. ఈ గేమ్‌లో పాల్గొనదలచిన వారు గేమ్ నిర్వాహ‌కులు చెప్పినట్లు చేయాలి. చేసితీరాలి. 50 రోజులు వాళ్లు ఇచ్చే టాస్కులు చేస్తూ ఉండాలి. ముందు ఓ పేప‌ర్‌పై తిమింగ‌లం బొమ్మను వేయాలి. త‌ర్వాత ఈ బొమ్మను త‌మ శ‌రీరంపై వేసుకోవాలి. 
 
పిమ్మట హార్ర‌ర్ సినిమాలు చూడటం, అర్థరాత్రులు లేవ‌డం.. న‌డ‌వ‌టం వంటి టాస్కులు చేయాలి. అలా 50 రోజులు 50 టాస్కులు పూర్తి చేసిన త‌ర్వాత నిజంగానే సూసైడ్ చేసుకోవాలి. దీన్నే సెల్ఫ్ డిస్ట్రాయింగ్ అంటారు. ఈ గేమ్‌లో గెలవాలంటే ఖ‌చ్చితంగా సూసైడ్ చేసుకోవాల్సిందేన‌ని నిర్వాహ‌కులు పార్టిసిపెంట్స్‌పై ఒత్తిడి తెస్తారు. దీంతో గేమ్ గెల‌వాల‌న్న ఆరాటంతో అనేక మంది చిన్నారులు నిలువునా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇపుడు ఈ గేమ్ చాలా దేశాలకు విస్తరిస్తోంది. దీంతో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.