సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (15:22 IST)

13 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన బాలుడు.. వారిద్దరికీ పెళ్లి చేసిన పెద్దలు?

చైనాలో 13 ఏళ్ల బాలికను 13 ఏళ్ల బాలుడు గర్భవతిని చేశాడు. బాలికను ప్రేమలో పడేసి.. శారీరకంగా కలిసిన ఆ బాలుడు ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. ఆ ఇద్దరు మైనర్లకు వారి తల్లిదండ్రులు వివా

చైనాలో 13 ఏళ్ల బాలికను 13 ఏళ్ల బాలుడు గర్భవతిని చేశాడు. బాలికను ప్రేమలో పడేసి.. శారీరకంగా కలిసిన ఆ బాలుడు ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. ఆ ఇద్దరు మైనర్లకు వారి తల్లిదండ్రులు వివాహం చేసిపెట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. చైనా హైనన్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలిక గర్భం ధరించింది. ఆ బాలికకు అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడితో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో గ్రామ ప్రజలు.. తల్లిదండ్రులు వారికి వివాహం చేసి పెట్టారు. ఈ గ్రామంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. 
 
బాల్య వివాహాలు చేయడం సప్రదాయ పద్ధతి అని గ్రామ ప్రజలు అంటున్నారు. అమ్మాయిలు ఎదిగాక పెళ్లి చేయడం తప్పు లేదని.. ప్రస్తుతం వివాహం చేసి పెట్టిన జంట ఇప్పటికే ఒక్కటైందని.. బాలిక గర్భవతి కావడంతో వారిద్దరికీ వివాహం చేసిపెట్టినట్లు గ్రామస్థులు వెల్లడించారు.