శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:52 IST)

నగ్నంగా వివాహం చేసుకున్నారు.. వాళ్లిద్దరూ ప్రకృతి ప్రేమికులట...?

విమానంలో, నౌకలో వివాహం చేసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. నేల మీద కాకుండా ఆకాశంలో విహరిస్తూ.. వివాహం చేసుకున్న జంటలున్నాయి. తాజాగా ఇటలీలో నగ్నంగా ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. వెరైటీ కోసం ఈ జంట నగ్నం

విమానంలో, నౌకలో వివాహం చేసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. నేల మీద కాకుండా ఆకాశంలో విహరిస్తూ.. వివాహం చేసుకున్న జంటలున్నాయి. తాజాగా ఇటలీలో నగ్నంగా ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. వెరైటీ కోసం ఈ జంట నగ్నంగా వివాహం చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇటలీకి చెందిన వేల్టిన్ అనే వ్యక్తి ఆర్సన్ అనే మహిళను ప్రేమించాడు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. కానీ వీరిద్దరి వివాహానికి పెద్దలు అడ్డు చెప్పారు. అంతేగాకుండా వీరిద్దరూ ప్రకృతి ప్రేమికులు కావడంతో ఇద్దరూ నగ్నంగా వివాహం చేసుకోవాలని తీర్మానించారు. 
 
దీని ప్రకారం ఇద్దరూ ఓ దీవిలో నగ్నంగా ఒక్కటయ్యారు. వీరి పెళ్ళికి ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. వారు కూడా నగ్నంగానే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.