శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (22:11 IST)

60 కేజీల బంగారు ఆభరణాలు ధరించిన వధువు.. ఎక్కడ?

సాధారణంగా వధువు నుంచి వరుడు కట్నకానుకలు స్వీకరిస్తుంటారు. కానీ, ఇక్కడ తద్విరుద్ధంగా జరిగింది. వధువుకు వరుడు ఏకంగా 60 కేజీల బంగారాన్ని బహుమతిగా ఇచ్చారు. పైగా, ఈ బంగారాన్ని వధువు ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
గత సెప్టెంబరు నెల 30వ తేదీన చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన ఓ వ‌ధువు పెండ్లి మంట‌పాన‌ త‌న భ‌ర్త బ‌హుక‌రించిన 60 కిలోల బంగారపు నగలను ధరించి వచ్చింది. ఈ ఆభరణాలు పెళ్లికి వచ్చిన అతిథులు, నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేసింది. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధ‌రించి త‌న చేతిలో గులాబీలు ప‌ట్టుకుని ఒంటి నిండా న‌గ‌ల‌తో ఆమె ముస్తాబైంది.
 
ఒక్కోటి కిలో బ‌రువున్న 60 బంగారు నెక్లెస్‌ల‌ను పెండ్లికొడుకు ఆమెకు కానుక‌గా అందించాడు. వాటికి తోడు ఆమె రెండు చేతుల నిండా బంగారు గాజులు ధ‌రించింది. పెండ్లికొడుకు సంప‌న్న కుటుంబానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో వ‌ధువును బంగారు ఆభ‌ర‌ణాల్లో ముంచెత్తాడు. ఇక‌ పెద్ద‌ సంఖ్య‌లో గోల్డ్ నెక్లెస్‌లు, బంగారు గాజుల‌తో వ‌ధువు క‌నిపించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతున్నాయి.