యూఎస్‌లో చెన్నై మహిళకు అరుదైన గౌరవం
అమెరికాలో చెన్నై మహానగరానికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. 38 యేళ్ళ షిఫాలి రంగనాథన్ అనే చెన్నై మహిళ... సియాటెల్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
అమెరికాలో చెన్నై మహానగరానికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. 38 యేళ్ళ షిఫాలి రంగనాథన్ అనే చెన్నై మహిళ... సియాటెల్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఒక స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న షిఫాలిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కస్, ఆమెకు ఈ పదవిని ఇచ్చారు. షెపాలి తండ్రి రంగనాథన్. తల్లి షెరిల్ ఇప్పటికీ 2001 వరకూ చెన్నైలో ఉండి, ఆపై అమెరికాకు వెళ్లారు.
చెన్నై నుంగంబాక్కంలోని గుడ్ షెప్పర్డ్ కాన్వెంట్, స్టెల్లా మేరీస్ కళాశాలల్లో చదివిన షిఫాలీ, బీఎస్సీలో జువాలజీ పట్టా పొందారు. అన్నావర్సిటీలో ఎన్విరాన్ మెంటల్ సైన్స్‌లో విభాగంలో బంగారు పతకాన్ని కూడా పొందారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు.