బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (09:53 IST)

ప్రిపరేషన్ ఎంత ఫాస్టో... సర్వ్ కూడా అంతే ఫాస్ట్.. రోలర్ స్కేట్స్‌ సప్లై (Video)

సాధారణంగా హోటల్‍‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ చేసిన ఆర్డర్ కాస్త ఆలస్యమైతే.. అబ్బ.. ఏంటి ఇంత ఆలస్యమా అని అడుగుతారు. కానీ, చైనాలోని ఓ రెస్టారెంట్ మాత్రం ఇందుకు మినహాయింపు. అక్కడ ఆర్డర్ ఇచ్చిన మరుక్షణమే.. ఆహారపదార్థాలు సర్వ్ చేస్తారు. అదీకూడా నడుస్తూ కాదు సుమా. వీల్స్‌తో రయ్ మంటూ దూసుకొస్తూ సర్వ్ చేస్తారు. 
 
చైనాలోని షాంఘైలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో పనిచేసే వెయిటర్లు, సర్వర్లు అందరూ కాళ్లకు చక్రాలేసుకుని మరీ పనిచేస్తారు. రోలర్ స్కేట్స్‌పై రయ్ రయ్‌మంటూ దూసుకొస్తుంటారు. రెండు చేతులతో ఫుడ్ ఐటమ్స్.. ప్లేట్లు పట్టుకుని వచ్చి ఎక్కడ కావాలో అక్కడ బ్రేకులేసి ఆగిపోతారు. 
 
రెస్టారెంట్లో మూల మలుపుల దగ్గర వాళ్లు ఎలా టర్నవుతారో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంత ఫాస్ట్‌గా.. ఇంత వేగంగా రోలర్ స్కేట్లపై తిరిగే వెయిటర్లను చూసేందుకే రెస్టారెంట్‌కు ఎక్కువ మంది వస్తారట. ఈ రెస్టారెంట్ కూడా మామూలుది కాదు. రాయల్ రెస్టారెంట్. ఇది చాలా కాస్ట్‌లీ గురూ.